అంతర్జాతీయ న్యాయస్థానంలో భారత్‌ విజయం


గూఢచర్యానికి పాల్పడుతున్నారనే ఆరోపణతో భారత నావికాదళ మాజీ అధికారి కులభూషణ్‌ జాదవ్‌కు పాకిస్థాన్‌ సైనిక న్యాయస్థానం విధించిన మరణశిక్షను అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసీజే) నిలిపివేసింది. ఈ కేసులో తుది తీర్పు వెలువడేటంత వరకు జాదవ్‌పై శిక్ష అమలు జరగకుండా పాకిస్థాన్‌ అన్ని చర్యలూ తీసుకోవాలని ఐసీజే అధ్యక్షుడు రోనీ అబ్రహాం గురువారం తీర్పు వెలువరించారు. ఉత్తర్వును అమలు చేయడంలో తీసుకుంటున్న చర్యలన్నింటినీ తమకు తెలపాలని 11 మంది న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం ఏకగ్రీవంగా పాకిస్థాన్‌ను ఆదేశించింది. దీంతో భారత్‌కు ఘన విజయం లభించినట్లయింది. పాకిస్థాన్‌ మాత్రం ఈ తీర్పును ఆమోదించేది లేదని కరాఖండీగా ప్రకటించింది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది