కాటమరాయుడు రిలీజ్ డేట్ - 100 కోట్లు

కాటమరాయుడు రిలీజ్ డేట్ మీద అందరికి అపోహ .  చిత్ర యూనిట్  మొదటగా అనుకున్నది March 29 న రిలీజ్ చేద్దాం అని , ఇది ఇలా ఉంటె సినిమాను అనుకున్న డేట్ కంటే ముందే రిలీజ్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నట్టు విశ్వనీయ సమాచారం,

ఇంతకీ కథ ఏంటంటే.  కాటమరాయుడు షూటింగ్ మొత్తం పూర్తి అయిపోయి ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ పనిలో ఉంది. పోస్ట్ ప్రొడక్షన్ అయిపోయి మొదటి కాపీ ఈ నెల 20 న వచ్చే అవకాశం ఉండడంతో ఈ చిత్ర నిర్మాత తన డిస్ట్రిబ్యూటర్లందరికి రిలీజ్ గురుంచి  ప్రాధమిక సమాచారం అందించినట్లు తెలుస్తుంది, March 24 న ఈ చిత్రం విడుదల కానున్నదని ప్రాధమిక సమాచారం.

ఇదే నిజమైతే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పండగ ఈ వేసవికి మొదలైనట్టే, అందులోను సమ్మర్ లో వస్తున్న మొదటి మూవీ, ఇంకా ఏ ఇతర స్టార్ మూవీస్ లేకపోవడం ఈ సినిమా రిలీస్ కి పెద్ద అసెట్. ఇప్పటికే సినిమా ప్రోమోస్ అందరిలోనూ అంచనాలను భారీగా పెంచేసాయి, ఈ వేడికి ఈ జోరు తోడు కానుంది సొ ఈ సమ్మర్ ఎలా ఉండనుంది ఇంకా కొంత సమయం వేచి చూడాలి

ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం మొదటి రోజు 40 కోట్ల షేర్ కలెక్ట్ చేయగలదని అంచనా.  ఎలా చూసుకున్న ఈ చిత్రం 100 కోట్లు కలెక్ట్ చేయడం ఏటువంటి సందేహం లేదు.  

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది