స్పైడర్‌ టీజర్‌ మే 31న విడుదల


స్పైడర్‌ టీజర్‌ను మే 31న విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఆ రోజు మహేష్‌ తండ్రి కృష్ణ పుట్టినరోజు కావడంతో టీజర్‌ విడుదల చేయాలని ప్లాన్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని తమిళంలోనూ ఒకేసారి విడుదల చేయబోతున్నారు. హేరిస్‌ జైరాజ్‌ స్వరాలందిస్తున్నారు. రకుల్‌ప్రీత్‌సింగ్‌ కథానాయిక. ఎన్‌వీఆర్‌ సినిమాస్‌ పతాకంపై ఎన్‌వీ ప్రసాద్‌, ఠాగూర్‌మధు నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఆగస్టు తొలివారంలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది