ఆండ్రాయిడ్‌ కొత్త వెర్షన్‌ వచ్చేసింది!

ప్రముఖ సెర్చింజిన్‌ దిగ్గజం గూగుల్‌ తాజాగా కాలిఫోర్నియాలో జరుగుతున్న డెవలపర్స్‌ సమావేశంలో ఆండ్రాయిడ్‌ ‘ఓ బేటా’ వెర్షన్‌ను విడుదల చేసింది. నూగట్‌కు అనంతరం మరికొన్ని ఫీచర్స్‌ను జోడిస్తూ ఈ వెర్సన్‌ను విడుదల చేసింది. ఇందులో కొత్తగా స్మార్ట్‌ టెక్ట్స్‌ సెలక్షన్‌, నోటిఫికేషన్‌ డాట్స్‌ వంటివి జోడించింది. కీ బోర్డు నేవిగేషన్‌కు సైతం కొద్ది మార్పులు చేసింది. కొత్త వెర్షన్‌ ద్వారా బ్యాటరీ వినియోగం సైతం మెరుగుపడుతుందని కంపెనీ వెల్లడించింది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది