బ్యాంకులు వాటి వాతలు - SBI వంతు

ప్రతి సామాన్యుడి  నుండి సంపన్నుడి వరకు అందరు sbi లో ఖాతా కలిగి ఉండడం మాములు విషయమే దానికి కారణం మిగిలిన బ్యాంకులతో పోల్చు కుంటే sbi లో జరిగే లావాదేవీల మీద విధించే అదనపు బాదుడు ఉండదు అయితే నిన్నటి sbi ప్రకటన సామాన్యులలో కలవరం కలిగిస్తుంది కొన్ని ఛార్జిలను పెంచి ఖాతాదారుల నడ్డి విరవనుంది. ఇక sbi బాదుడు లెక్క ఏంటి అనేది ఒక కన్నేయండి క్రింద .


  •  బ్యాంకులో క్యాష్ డిపాజిట్ ను మూడుసార్ల వరకూ మాత్రమే ఫ్రీ. నాలుగో సారి నుంచి సేవా పన్నుతో సహా రూ.50 చార్జ్ వేస్తారు
  • ఎస్ బీఐ ఏటీఎం నుంచి విత్ డ్రా ను ఐదుసార్లు దాటితే రూ.10 చొప్పున వేసేస్తారు.
  • ఒకవేళ మినిమం బ్యాలెన్స్ కంటే 50 శాతం తక్కువ ఉంటే సర్వీస్ ఛార్జ్ తో పాటు రూ.50 జరిమానా (నాన్ మెట్రోపాలిటన్)
  •  మెట్రోపాలిటన్ శాఖల్లో ఖాతా ఉన్న వారు కనీసం బ్యాలెన్స్ ను రూ.5వేలుగా ఫిక్స్ చేశారు.
  •  ఆ మొత్తంలో 75 శాతం కంటే తక్కువ ఉంటే సేవా పన్నుతో రూ.100 ఫైన్ వేస్తారు.
  • ఎస్ఎంఎస్ అలెర్ట్ లపై నెలకు రూ.15 వడ్డన.
  • అకౌంట్లో రూ.25వేల కంటే ఎక్కువ క్యాష్ ఉంటే.. ఎస్ బీఐ ఏటీఎం నుంచి ఎన్నిసార్లు అయినా విత్ డ్రా చేసుకునే ఆఫర్ ఉంది. అలా అని ఇతర బ్యాంకుల ఏటీఎంల నుంచి విత్ డ్రా చేస్తే మాత్రం ఛార్జీలు తప్పవు.

  • ఒకవేళ అకౌంట్లో లక్ష రూపాయిల మొత్తం ఉంటే.. ఇతర బ్యాంకుల ఏటీఎం నుంచి ఎన్నిసార్లుఅయినా విత్ డ్రా చేసుకోవచ్చు. ఎలాంటి ఛార్జీలు ఉండవు. అయితే.. విత్ డ్రా చేసిన తర్వాత లక్ష కంటే తక్కువ మాత్రం అమౌంట్ తగ్గకూడదు.  
  • ఇతర బ్యాంకుల ఏటీఎం నుంచి క్యాష్ విత్ డ్రా ను ముచ్చటగా మూడుసార్లు మాత్రమే ఉచితం . నాలుగోసారి నుంచి ప్రతిసారి రూ.20 చొప్పున బాదేస్తారు.
ఈ బాదుడు ఏప్రిల్ 1 నుంచి అమలులోకి రానుంది, ఇది sbi లో విలీనం కానున్న అన్ని బ్యాంకులకు వర్తించనుంది



కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది