చిరంజీవి, మహేష్‌, మురుగదాస్‌ ఒకే సెట్లో, మెగా స్టార్, సూపర్ స్టార్ ద్వయం కేక పుట్టిస్తుందేమో

మురుగదాస్‌ దర్శకత్వంలో మహేష్‌బాబు కథానాయకుడిగా తెరకెక్కుతున్నచిత్రం హైదరాబాద్‌లోని ఓ స్టూడియోలో షూటింగ్ జరుపుకుంటుంది. ఆ సెట్‌లోకి అనుకోకుండా మెగా స్టార్ చిరంజీవి అడుగుపెట్టారు. మహేష్‌, మురుగదాస్‌లతో చిరంజీవి సెట్‌లో చాలాసేపు ముచ్చటించారు. చిరంజీవి, మహేష్‌, మురుగదాస్‌లు సెట్లో ఉన్నప్పటి క్షణాలను ప్రముఖ కెమెరామెన్ సంతోష్‌ శివన్‌ క్లిక్‌మనిపించారు. ఆయన ఆ ఫొటోని ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. చిరంజీవి ఇదివరకు మురుగదాస్‌ దర్శకత్వంలో ‘స్టాలిన్‌’లో నటించారు.

ఇంతకీ చిరు రాకకు కారణం ఏమిటి - మీలో ఎవరు కోటీశ్వరుడు షో లో పార్టిసిపేట్ చేయమని కొరడానికేనా అదే నిజమైతే స్మాల్ స్క్రీన్ లో మెగా స్టార్, సూపర్ స్టార్ ద్వయం కేక పుట్టిస్తుందేమో చూడాలి. 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది