వన్నాక్రై’కాదు అంతకుమించిన మరో సైబర్‌ దాడి

వన్నాక్రై’కాదు అంతకుమించిన మరో సైబర్‌ దాడి



అడిల్‌కుజ్‌:కంప్యూటర్‌ ప్రపంచానికి మరో షాకింగ్‌ న్యూస్‌. ‘వన్నాక్రై’కి మించిన మరో వైరస్‌ కంప్యూటర్లపై దాడికి దిగిందని సెక్యూరిటీ పరిశోధకులు గుర్తించారు. ‘అడిల్‌కుజ్‌’గా పిలుస్తున్న ఈ వైరస్‌ ‘వన్నాక్రై’ కంటే అత్యంత ప్రమాదకరమైందట. ఈ విషయాన్ని అమెరికాలోని ప్రూఫ్‌ప్రింట్‌ సైబర్‌ సెక్యూరిటీ సంస్థకు చెందిన నిపుణులు వెల్లడించారు.
‘వన్నాక్రై’ మాదిరిగానే అడిల్‌కుజ్‌ కంప్యూటర్లపై దాడి చేస్తుందట. అయితే ‘వన్నాక్రై’ వైరస్‌ దాడికి గురైన కంప్యూటర్‌లోని ఫైళ్లన్నీ ఎన్‌క్రిప్ట్‌ అయిపోతాయి. హ్యాకర్లకు బిట్‌కాయిన్‌ రూపంలో డబ్బు చెల్లిస్తేనే ఆ కంప్యూటర్‌ మామాలు స్థితిలోకి వస్తుంది. కానీ.. అడిల్‌కుజ్‌ మాత్రం అలా చేయదట. గుట్టుచప్పుడు కాకుండా కంప్యూటర్లలోకి చొరబడి.. వినియోగదారుడికి తెలియకుండానే అతని కంప్యూటర్లు వాడుకుంటుంది . 
ఈ వైరస్‌ దాడికి గురైన కంప్యూటర్ల పనితీరులో కొద్దిపాటి తేడా కనిపిస్తుందని.. అది చాలామంది గుర్తించలేనంతగా ఉంటుందని పరిశోధకులు తెలిపారు. ఇది ‘వన్నాక్రై’ కంటే చాలా పెద్ద దాడి అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది