ట్రంప్‌ కుమారుడికి కొవిడ్‌

అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కుమారుడు 14 ఏళ్ల బారన్‌ ట్రంప్‌కు కూడా కరోనా వైరస్‌ సోకింది. అయితే అతనికి ఏ విధమైన లక్షణాలు లేవని.. తల్లితండ్రులు ఇద్దరికీ కొవిడ్‌-19 రావటంతో బారన్‌కు కూడా కొవిడ్‌-19 నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. దానితో ఈ విషయం వెల్లడైందని ప్రస్తుతం తను, తన కుమారుడు కూడా కరోనా నెగిటివ్‌ అని ప్రథమ మహిళ మెలానియా వెల్లడించారు. ఈ మేరకు విడుదల చేసిన ఓ ప్రకటనలో.. టీనేజ్‌లో ఉన్న బారన్‌ను కరోనా లక్షణాలు అంతగా బాధించలేదని ఆమె వివరించారు. ట్రంప్‌తో సహా తమ ముగ్గురికీ ఒకేసారి కొవిడ్‌ సోకటం ఒక రకంగా మంచిదయిందని.. దీని వల్ల తాము ఒకరి బాగోగులు మరొకరు చూసుకోగలిగామని మెలానియా వివరించారు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది