హీరో మోటోకార్ప్‌ 125సీసీ బైకు గ్లామర్‌లో కొత్త వేరియంట్‌

అగ్రగామి ద్విచక్రవాహన దిగ్గజం హీరో మోటోకార్ప్‌ 125సీసీ బైకు గ్లామర్‌లో కొత్త వేరియంట్‌ను విపణిలోకి విడుదల చేసింది. దీని ధరను రూ.72,000 (ఎక్స్‌- షోరూమ్‌)గా నిర్ణయించారు. బీఎస్‌-6 నిబంధనలకు లోబడిన ఈ బైకులో హ్యాండిల్‌బార్‌కు అనుసంధానం చేసిన యూఎస్‌బీ ఛార్జర్‌, సైడ్‌ స్టాండ్‌ ఇండికేటర్‌ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ‘ఇటీవల విడుదల చేసిన కొత్త గ్లామర్‌కు మంచి స్పందన వచ్చింది. కొత్త బ్లేజ్‌ వేరియంట్‌ కూడా యువతను ఆకట్టుకుంటుందని ఆశిస్తున్నాం’ అని హీరో మోటోకార్ప్‌ హెడ్‌ (అమ్మకాలు, విక్రయానంతర సేవలు) నవీన్‌ చౌహాన్‌ తెలిపారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది