‘రాజుగారి గది 2’లో సమంత లుక్

సమంత తన కొత్త చిత్రం ‘రాజుగారి గది 2’ షూటింగ్‌లో తన లుక్‌కు సంబంధించి తొలి ఫొటోను సోషల్‌మీడియాలో షేర్‌ చేశారు. అందులో ఆమె నలుపు వర్ణం చుడిదార్‌ ధరించి కూర్చొని ఏదో ఆలోచిస్తూ చాలా అందంగా కనిపిస్తోంది. పీవీపీ సినిమా పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఓంకార్‌ తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో నాగార్జున నటిస్తున్నారు. ఈ చిత్రంలో తన లుక్‌కు సంబంధించిన తొలి ఫొటోను నాగార్జున సోమవారం ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. ఈ చిత్రంలో సీరత్‌ కపూర్‌ ఓ కథానాయిక పాత్ర పోషిస్తున్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది