జగన్ కు మళ్ళి జైలు తప్పదా - బెయిలును రద్దు చేయాలని సీబీఐ ప్రత్యేక కోర్టులో పిటిషన్‌ దాఖలు

జగన్ కు మళ్ళి జైలు తప్పదా 



వైకాపా అధ్యక్షుడు, ఏపీ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి సీబీఐ షాకిచ్చింది. అక్రమాస్తుల కేసులో ప్రధాన నిందితుడైన ఆయనకు ఇచ్చిన బెయిలును రద్దు చేయాలని సీబీఐ ప్రత్యేక కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. బెయిలు షరతులను జగన్‌ ఉల్లంఘించారని పేర్కొంది. ‘‘జగన్‌కు చెందిన జగతి పబ్లికేషన్‌ ఆధ్వర్యంలోని సాక్షి టీవీ, పత్రికలో వచ్చిన ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి రమాకాంత్‌రెడ్డి ఇంటర్వ్యూ కేసు విచారణకు హాని కలిగించేలా, ఇతర సాక్షులను ప్రభావితం చేసేలా ఉంది. ఈ మేరకు కోర్టు విధించిన షరతులను ఉల్లంఘించిన జగన్‌ బెయిలును రద్దు చేయాలి’’ అని సీబీఐ అభ్యర్థించింది. ఈ పిటిషన్‌పై కౌంటరు దాఖలు చేయాలని జగన్‌మోహన్‌రెడ్డిని ఆదేశిస్తూ తదుపరి విచారణను కోర్టు ఏప్రిల్‌ 7కి వాయిదా వేసింది.

ఒక వేళా కోర్ట్ సీబీఐ వాదనలతో ఏకీభవిస్తే జగన్ కు మళ్ళి జైలు తప్పదు, ఏప్రిల్‌ 7 వెయిట్ చేయాల్సిందే దీనిపై జగన్ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది