అవినీతిలో మనమే No.1

అవినీతిలో మనమే No.1 


మనదేశంలో నూటికి 69 మంది దీని బాధితులే 
భారత్‌లో లంచం ఇచ్చినవారిలో దాదాపు 73% మంది పేదలే
 చైనా లాంటి దేశాల్లో పేదల కంటే ధనిక వర్గాలు ఎక్కువగా ముడుపులు చెల్లించేది 
పోలీస్ డిపార్ట్మెంట్ టాప్ ప్లేస్
ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్‌ అధ్యనం లో వెల్లడి 


ఆసియా-పసిఫిక్‌ ప్రాంతంలోని 16 దేశాల్లో జరిగిన ఈ సర్వేలో భారత్‌లోనే అవినీతి అత్యంత ఎక్కువని తాజా అధ్యయనంలో తేలింది. భారత్‌లో 69 శాతం మంది అంటే ప్రతీ పది మందిలో దాదాపు ఏడుగురు దీని బాధితులేనని ప్రముఖ సంస్థ ‘ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్‌’ తెలిపింది.

1. భారత దేశం : 69%
2. వియాత్నం : 65%
3. పాకిస్థాన్‌:  40%
4. చైనాలో 26% 

జపాన్‌లో అవినీతి కేవలం 0.2 శాతంగా ఉంది అంటే అవినీతి నిర్మూలనలో జపాన్‌ ముందుంది. దక్షిణ కొరియాలో మూడు శాతంగా ఉంది.


ఆరు సేవలపై అధ్యయనం :

పీపుల్‌ అండ్‌ కరప్షన్‌: ఏసియా పసిఫిక్‌’ పేరుతో మంగళవారం జర్మనీలోని బెర్లిన్‌లో ఈ సంస్థ నివేదిక విడుదల చేసింది. ఆసియా-పసిఫిక్‌లోని భారత్‌, చైనా, పాకిస్థాన్‌, శ్రీలంక, మలేషియా, కంబోడియా, ఇండోనేషియా, జపాన్‌, వియత్నాం, థాయ్‌లాండ్‌, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా తదితర దేశాల్లో దాదాపు 22 వేల మందిని అధ్యయనకర్తలు ప్రశ్నించారు.
ఆరు కీలక సేవల్లో అవినీతిపై అధ్యయనం దృష్టి కేంద్రీకరించింది. 
1. ప్రజోపయోగ సేవలు, 
2. ధ్రువీకరణ పత్రాలు పొందడం, 
3. ప్రభుత్వ పాఠశాలలు, 
4. ప్రభుత్వ ఆస్పత్రులు, 
5. పోలీసులు, 
6. న్యాయస్థానాల నుంచి సేవలు పొందడం 
భారత్‌లో అవినీతిలో పోలీసు వ్యవస్థ మొదటి స్థానంలో ఉందని, ఇది అవినీతిమయమని 85% మంది అభిప్రాయపడ్డారు. తర్వాతి స్థానాల్లో ప్రభుత్వ అధికారులు, వ్యాపారవేత్తలు, స్థానిక కౌన్సిలర్లు, ఎంపీలు, పన్ను అధికారులు, మతపెద్దలు-బాబాలు ఉన్నారు. 
భారత్‌లో లంచం ఇచ్చినవారిలో దాదాపు 73% మంది పేదలే. పాక్‌లో ఈ సంఖ్య 64 శాతంగా ఉంది. చైనా లాంటి దేశాల్లో పేదల కంటే ధనిక వర్గాలు ఎక్కువగా ముడుపులు చెల్లిస్తున్నాయి.
 లంచగొండితనం పెరుగుదలలో భారత్‌ ఏడో స్థానంలో ఉంది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది