మహేష్‌ కొత్త చిత్రం ఫస్ట్‌లుక్‌






మహేష్‌ అభిమానులు ఎదురుచూస్తున్న తరుణం త్వరలోనే రానుంది. ఆయన కథానాయకుడిగా మురుగదాస్‌ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్‌ వియత్నాంలో జరుగుతోంది. ఉగాది సందర్భంగా కొత్త సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను విడుదల చేసే అవకాశం ఉందని అందరూ భావించారు. అయితే వియత్నాంలో షూటింగ్‌ ముగించుకుని వచ్చిన తర్వాతే ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసే అవకాశాలున్నాయని ఫిలింనగర్‌ వర్గాల సమాచారం. ఏప్రిల్‌ 2న చిత్ర యూనిట్‌ చెన్నైకు చేరుకుంటుంది.  అప్పుడు ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ విడుదల చేసే అవకాశం ఉండవచ్చు. 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది