బాలయ్య పాత్ర లీక్




నందమూరి బాలకృష్ణ - పూరి జగన్నాథ్‌ల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రంలో బాలకృష్ణ పాత్రకు సంహందించి ఒక కీలక వార్త ప్రస్తుతం ప్రచారంలో ఉంది అది ఏంటి అంటే బాలకృష్ణ ఒక గ్యాంగ్‌ స్టర్‌ పాత్ర చేస్తున్నారు అని. అప్పుడే ఓ ఫైట్‌ కూడా పూర్తి చేశారు. ఈ చిత్రంలో బాలయ్య గెటప్‌, ఆయన పలికే సంభాషణలు అభిమానుల్ని అలరిస్తాయని పూరి ముందు నుంచీ చెబుతూనే ఉన్నాడు. 

ఈ సినిమాకి ఎక్స్‌ట్రా గ్లామర్‌ అద్దడానికి కసరత్తులు చేస్తున్నాడు పూరి. ఈ చిత్రంలో ముగ్గురు కథా నాయికలుంటారు. పోర్న్‌ స్టార్‌ సన్నీలియోనితో ప్రత్యేక గీతం చేయిస్తున్నాడు పూరి. ఈ సినిమా కోసం పలు టైటిళ్లు పరిశీలనలో ఉన్నాయి. ‘టపోరి’, ‘ఉస్తాద్‌’ అనే టైటిళ్లు సోషల్‌ మీడియాలో హల్‌ చల్‌ చేస్తున్నాయి.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది