ఎన్టీఆర్‌ జీవిత కథని తెరకెక్కించడానికీ రంగం సిద్ధం


ఎన్టీఆర్‌ జీవిత కథని తెరకెక్కించడానికీ రంగం సిద్ధం చేసుకొంటున్నారు. తేజ దర్శకత్వం వహిస్తారు. స్క్రిప్టు పనులు వేగంగా సాగుతున్నాయి. ఇప్పుడు టైటిల్‌ కూడా దాదాపుగా ఖరారైంది. ఈ చిత్రం కోసం ‘ఎన్టీఆర్‌’ అనే పేరుని ఫిల్మ్‌ ఛాంబర్‌లో నమోదు చేసింది చిత్రబృందం. ఎన్టీఆర్‌ పాత్రలో బాలకృష్ణ కనిపించనున్నారు. తెలుగు, తమిళ భాషల్లో విడుదల చేస్తారు. బాలీవుడ్‌కీ తీసుకెళ్లాలన్నది చిత్రబృందం ఆలోచన. మిగిలిన నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాల్ని త్వరలో ప్రకటిస్తారు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది